ఈ బడ్జెట్ పెట్టాలంటే కష్టమే సుమీ?
RX 100 ని లో బడ్జెట్ లో తెరకెక్కించి… బంపర్ హిట్ కొట్టడంతో.. దర్శకుడు అజయ్ భూపతికి తన మీద కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోయింది. ఆ సినిమా [more]
RX 100 ని లో బడ్జెట్ లో తెరకెక్కించి… బంపర్ హిట్ కొట్టడంతో.. దర్శకుడు అజయ్ భూపతికి తన మీద కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోయింది. ఆ సినిమా [more]
RX 100 ని లో బడ్జెట్ లో తెరకెక్కించి… బంపర్ హిట్ కొట్టడంతో.. దర్శకుడు అజయ్ భూపతికి తన మీద కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత మీడియం హీరోతో మీడియం బడ్జెట్ అంటూ ఓ కథ రాసుకుని మీడియం హీరోల చుట్టూ తిరిగాడు. నితిన్ దగ్గరనుండి, నాగ చైతన్య, రవితేజ ఇలా అందరూ తన కథని, తనని నమ్మడం లేదని చివరికి తన వద్ద ఉన్న మహా సముద్రం కథతో శర్వానంద్ ని కలవడం కథని ఓకె చేసుకుని ఈ సినిమా చెయ్యడానికి రెడీ అవ్వడం జరిగింది. ఇక ఈ సినిమాలో మరో హీరో కూడా కావాలి. ప్రస్తుతం ఆ పనుల్లో ఉన్న అజయ్ కి నిర్మాత జెమిని గణేష్ షాకిచ్చినట్లుగా తెలుస్తుంది.
మహా సముద్రం కథకి 30 కోట్ల బడ్జెట్ అవుతుందట. హీరో, హీరోయిన్ ల పారితోషకాలతో కలిపి ఈ రేంజ్ బడ్జెట్ అజయ్ భూపతి నిర్మాతకి చెప్పాడట. అయితే ప్రస్తుతం కెరీర్ అప్ అండ్ డౌన్స్ లో ఉన్న హీరో శర్వా మీద 30 కోట్ల బడ్జెట్ పెట్టడానికి నిర్మాత సిద్ధంగా లేడని, అదే విషయం అజయ్ భూపతికి కి చెబితే వినడం లేదని అంటున్నారు. మరి శర్వా రేంజ్ తక్కువేమి కాదు. కాకపోతే రణరంగం లాంటి డిజాస్టర్ తర్వాత జాను సినిమా చేసాడు. అది రేపు 7 న విడుదల కాబోతుంది. ఆ సినిమా హిట్ అయితే శర్వా రేంజ్ పెరుగుతుంది. ఒకవేళ ఆ సినిమా అటు ఇటు అయితే.. మహా సముద్రం కథకి శర్వా మీది 30 కోట్లు పెట్టడానికి నిర్మాతలు ఖచ్చితంగా ఆలోచిస్తారని టాక్ వినబడుతుంది. మరి ఇద్దరు హీరోలకి పారితోషకం అటుంచి.. ఈసినిమా స్టార్ హీరోయిన్ కే అజయ్ ఫిక్స్ అవడంతో.. బడ్జెట్ లో సగం నటుల పారితోషకాలకే పోతుందని.. మిగతా దానిలో సినిమాని జాగ్రత్తగా తెరకెక్కించాలని చూసున్నాడట అజయ్.