Unstoppable 2 : ఈ వారం ఆ ఇద్దరు యంగ్ క్లాస్ హీరోలే గెస్టులు..

మూడో ఎపిసోడ్ కి ఇద్దరు క్లాస్ హీరోలు తమ అనుభవాలు, విశేషాలను పంచుకునేందుకు ‘అన్‌స్టాపబుల్ 2’ కి విచ్చేశారు. ఈ సారి కూడా..;

Update: 2022-10-31 13:09 GMT
sharwanand and adavi sesh, tollywood most eligible bachelors

unstoppable 2 latest episode

  • whatsapp icon

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో ప్రసారమవుతోన్న 'అన్‌స్టాపబుల్ 2' టాక్ షో విజయవంతంగా దూసుకుపోతోంది. మొదటి సీజన్ కంటే.. రెండో సీజన్లో బాలయ్య డబుల్ ఎనర్జీ, డబుల్ జోష్ తో షో ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు స్ట్రీమ్ అవ్వగా.. మూడో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది ఆహా టీమ్. ఎపిసోడ్‌కు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లు గెస్టులుగా రాగా, ఆ ఎపిసోడ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక రెండో ఎపిసోడ్‌లో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ గెస్టులుగా వచ్చి రచ్చ రచ్చ చేశారు. ఇద్దరూ మాస్ హీరోలే కావడంతో.. భారీ క్రేజ్ వచ్చింది.

మూడో ఎపిసోడ్ కి ఇద్దరు క్లాస్ హీరోలు తమ అనుభవాలు, విశేషాలను పంచుకునేందుకు 'అన్‌స్టాపబుల్ 2' కి విచ్చేశారు. ఈ సారి కూడా ఇద్దరు హీరోలను బాలయ్య టాక్ షోకు తీసుకొస్తున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది. అన్‌స్టాపబుల్ 2 టాక్ షో మూడో ఎపిసోడ్‌లో యంగ్ హీరోలు, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ శర్వానంద్, అడివి శేష్‌లు గెస్టులుగా రాబోతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు ఆహా వీడియో ట్వీట్ చేసింది. అడవి శేష్, శర్వానంద్ చేసే సినిమాలు స్పెషల్ గా ఉంటాయి. అరుదైన ఇంట్రస్టింగ్ కథలతో వచ్చి.. ఆడియన్స్ ను మాయ చేస్తారు. వీరిద్దరూ చేసిన సినిమాలు దాదాపు హిట్టయ్యాయి. మేజర్ గా ఏడిపించిన అడవి శేష్.. డిసెంబర్ 2న హిట్ 2 తో సస్పెన్స్ గా రానున్నాడు. కాగా..ఈ ఎపిసోడ్‌ను త్వరలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా తెలిపింది.





Tags:    

Similar News