అందుకే ప్రయోగాల జోలికి వెళ్ళలేదంటున్న హీరోయిన్!!

కమల్ హాసన్ సినిమాల విషయంలో ఎప్పుడు ఏదో ఓ ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. గతంలో విచిత్ర సోదరులు సినిమా అయినా, మొన్నామధ్యన దశావతారం అయినా ఇలా చాలా [more]

Update: 2020-08-11 05:46 GMT

కమల్ హాసన్ సినిమాల విషయంలో ఎప్పుడు ఏదో ఓ ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. గతంలో విచిత్ర సోదరులు సినిమా అయినా, మొన్నామధ్యన దశావతారం అయినా ఇలా చాలా సినిమాల్లో కమల్ హాసన్ చాలా ప్రయోగాలు చేసాడు. కానీ ఆయన కూతురు శృతి హాసన్ మాత్రం నా తండ్రి లాగా నేను ఎలాంటి ప్రయోగాలు చెయ్యలేదు అని చెబుతుంది. కారణం శృతి హాసన్ కి కమల్ తన తండ్రి అని చెప్పుకుని అవకాశాలు సంపాదించడం తనకి నచ్చదట. అసలు సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు తన తండ్రి కమల్ హాసన్ ని సలహా అడిగిందట. నాన్న నేను సినిమాల్లోకి రావాలనుకున్నాను సలహా చెప్పండి అని.  దానికి కమల్ హాసన్ నవ్వుతూ నటన ఒకరు నేర్పితే రాదు అది మనలో ఉండాలి.. అది నీలో ఉంది అనుకుంటే నటించు అని చెప్పాడట.

నా తండ్రి చెప్పిన ఆ మాట నేనెప్పటికీ మరిచిపోను అని చెబుతుంది శృతి హాసన్. ఆయన నాకు ప్రతి విషయంలోనూ స్ఫూర్తినిస్తారు. అందుకోసం నేను ఆయన నీడలో బ్రతకాలని , అయన పేరు చెప్పుకుని హీరోయిన్ గా ఎదగాలని నేనెప్పుడూ అనుకోలేదు. కమల్ హాసన్ కూతుర్ని అని చెప్పుకుని ఎప్పుడు అవకాశాలు అడగలేదు. ఎందుకంటే కమల్ కూతుర్ని అని చెప్పుకుని అవకాశం సంపాదిస్తే నాకంటూ ఆ తృప్తి మిగలదు. అందుకే కమల్ కూతురిగా నాపై ఎలాంటి ముద్ర ఉండకూడదనే ఆయనలా ప్రయోగాల జోలికి వెళ్ళలేదు అంటుంది శృతి హాసన్.

Tags:    

Similar News