చిరంజీవికి కేసీఆర్ ఫోన్.. త్వరగా కోలుకోవాలంటూ..
చిరంజీవి త్వరగా కరోనా నుంచి కోలుకోవాలంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా.. తెలంగాణ సీఎం కేసీఆర్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నిన్న చిరంజీవే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చిరంజీవి త్వరగా కరోనా నుంచి కోలుకోవాలంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ చిరంజీవికి ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు కేసీఆర్. త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
కాగా.. చిరంజీవి ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. చిరంజీవి తనకు కరోనా సోకిందని పోస్ట్ చేసిన కొద్దిసేపటికే.. కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్, మరో సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా తమకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇలా టాలీవుడ్ లో సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.