Unstoppable 2 : బాలయ్య టాక్ షో కి పవన్ కల్యాణ్ వస్తారా ?

ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది. ఇద్దరు కుర్రహీరోలతో బాలయ్య పోటీపడి మరీ రచ్చ చేశారు. వీరిద్దరితో పాటు..;

Update: 2022-10-17 02:48 GMT
siddu jonnalagadda, vishwaksen, pawan kalyan

unstoppable 2 new promo

  • whatsapp icon

UNSTOPPABLE SEASON 2 ఆరంభమై తొలి ఎపిసోడ్ కూడా స్ట్రీమ్ అవుతోంది. ఫస్ట్ ఎపిసోడ్ కి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ రావడంతో.. భారీ హైప్ ఉంది. ఈ ఎపిసోడ్ కి 24 గంటల్లో ఊహించని రీతిలో వ్యూస్ వచ్చాయి. మరి రెండో ఎపిసోడ్ కి ఎవరు వస్తున్నారు ? తాజాగా అందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది ఆహా. రెండో ఎపిసోడ్ లో గెస్టులుగా యంగ్ హీరోలైన విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ లో యువ హీరోలతో కలిసి బాలయ్య చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.

ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది. ఇద్దరు కుర్రహీరోలతో బాలయ్య పోటీపడి మరీ రచ్చ చేశారు. వీరిద్దరితో పాటు షోకు హాజరైన నిర్మాత సూర్య దేవర నాగవంశీ దర్శకుడు త్రివిక్రమ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వంశీ నుంచి ఫోన్ తీసుకున్న బాలయ్య.. 'త్రివిక్రమ్‌ షోకి ఎప్పుడొస్తున్నావ్‌' అని అడగ్గా, దానికి త్రివిక్రమ్‌ బదులిస్తూ.. 'మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తాను సార్‌' చెప్పారు. 'షోకి ఎవరితో రావాలో తెలుసుగా' అని బాలయ్య అనగానే.. ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో ఆ ఎవరు, మరెవరో కాదు.. పవన్‌ కళ్యాణ్‌ అని ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ టాక్ షోలలో పాల్గొన్న దాఖలాలు లేవు. బాలయ్య అన్‌స్టాపబుల్‌కి హాజరైతే మాత్రం ఆయన ఫ్యాన్స్‌కి పండగే. ఓ వైపు షూటింగ్ లు, మరోవైపు పార్టీ పనులతో బిజీగా ఉండే పవన్ కల్యాణ్ UNSTOPPABLE 2 కోసం సమయం కేటాయిస్తారో లేదో చూడాలి.
Full View





Tags:    

Similar News