నాగ్ కన్నా విజయ్ బెటరేమో..!

అక్కినేని నాగార్జున వెండితెర మీదే కాదు.. బుల్లితెర మీద కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో. బుల్లితెర మీద మీలో ఎవరు కోటీశ్వరులు అంటూ సీజన్ 1, [more]

Update: 2019-03-21 13:19 GMT

అక్కినేని నాగార్జున వెండితెర మీదే కాదు.. బుల్లితెర మీద కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో. బుల్లితెర మీద మీలో ఎవరు కోటీశ్వరులు అంటూ సీజన్ 1, 2లను సక్సె ఫుల్ గా నడిపిన నాగార్జున తర్వాతి సీజన్ కి అందుబాటులో లేకపోవడంతో ఆ బాధ్యతను చిరు నిర్వర్తించాడు. కానీ నాగ్ లాగా చిరు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు బుల్లితెర మీద భారీ క్రేజ్ ఉన్న బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ విషయంలో భలే సస్పెన్స్ కొనసాగుతుంది. సీజన్ 1ని యంగ్ టైగర్ అదరగొట్టేసి సెకండ్ సీజన్ కి హ్యాండ్ ఇవ్వగా.. దానికి స్టార్ మా యాజమాన్యం హీరో నానిని తీసుకొచ్చింది. ఇక నాని సెకండ్ సీజన్ ని బాగానే పండించినా ఆ బిగ్ బాస్ వలన నాని నెత్తి బొప్పికట్టింది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 3కి ఎన్టీఆర్ చెయ్యనని చెప్పడంతో ఇప్పుడు మరో క్రేజ్ ఉన్న హీరో కోసం స్టార్ మా సెర్చింగ్ మొదలెట్టింది.

విజయ్ దేవరకొండ అయితే బెటర్ అని

అయితే మీలో ఎవరు కోటీశ్వరుడుతో మెప్పించిన నాగార్జున అయితే బాగుంటుందని స్టార్ మా అనుకుంటుందట. ఎలాగూ నాగ్ తో స్టార్ మాకి మంచి సంబంధాలు ఉన్నాయి. మరోపక్క ప్రస్తుతం యూత్ లో భారీ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ అయితే.. బుల్లితెర ప్రేక్షకులు బాగా బిగ్ బాస్ ని ఆదరిస్తారని.. అందుకే విజయ్ దేవరకొండ కోసం స్టార్ మా యాజమాన్యం ప్రయత్నాలు మొదలెట్టిందనే టాక్ మొదలైంది. మరి నాగ్ కన్నా విజయ్ దేవరకొండనే బెటర్ అంటూ స్టార్ మాకి యూత్ రిక్వెస్ట్ లు అందుతున్నాయట. గీత గోవిందం, అర్జున్ రెడ్డి, టాక్సీవాలా లాంటి హిట్స్ తో విజయ్ కి క్రేజ్ మాములుగా రాలేదు. మరోపక్క నాగార్జున అనుభవం ముందు విజయ్ క్రేజ్ ఎంతవరకు పనికొస్తుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరోపక్క విజయ్ దేవరకొండ సినిమాలు, బ్రాండ్ అంబాసిడర్లు, యాడ్ షూట్స్, రౌడీ బ్రాండ్ బిజినెస్ తో బాగా బిజీగా ఉన్నారు. మరి బిగ్ బాస్ హోస్ట్ చేసేంత ఖాళీ ఉంటుందా అనేది డౌట్. చూద్దాం ఫైనల్ గా బిగ్ బాస్ 3ని నడిపించే రథసారధి ఎవరో అనేది.

Tags:    

Similar News