పొగరు దిగినట్లుందే

రెండు మూడు సూపర్ హిట్స్ కొట్టేసరికి కాస్త యాటిట్యూడ్ ఎక్కువైన విజయ్ దేవరకొండ కి డియర్ కామ్రేడ్ భారీ షాకిచ్చింది. డియర్ కామ్రేడ్ తో స్టార్ హీరోల [more]

Update: 2019-08-06 08:11 GMT

రెండు మూడు సూపర్ హిట్స్ కొట్టేసరికి కాస్త యాటిట్యూడ్ ఎక్కువైన విజయ్ దేవరకొండ కి డియర్ కామ్రేడ్ భారీ షాకిచ్చింది. డియర్ కామ్రేడ్ తో స్టార్ హీరోల పక్కన ప్లేస్ కొట్టేద్దామనుకున్న విజయ్ కి డియర్ కామ్రెడ్ ప్లాప్ తో కాస్త దిగొచ్చాడు. నిన్నటివరకు కాస్త పొగరు ప్రదర్శించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. డియర్ కామ్రేడ్ హిట్ అయితే టాప్ డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టేద్దామనుకున్న విజయ్ ఇప్పుడు మీడియం డైరెక్టర్స్ కోసం వెంపర్లాడుతున్నాడు. అందులోను విజయ్ నటిస్తున్న హీరో సినిమా షూటింగ్ కి బ్రేక్ పడడం, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విషయంలోనూ విజయ్ అసంతృప్తిగా ఉన్నాడనే టాక్ కూడా వినబడుతుంది.

పూరితో ఫిక్స్ అయ్యారట….

అయితే విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాధ్ సినిమా అనే టాక్ గత కొన్ని రోజులుగా అంటే..పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ హిట్ అవకముందు నుండే విజయ్ దేవరకొండ తో పూరి సినిమా విషయంలో పలు వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇక ఇస్మార్ట్ శంకర్ హిట్ అయ్యాక కూడా అన్నారు కానీ…. డియర్ కామ్రేడ్ హిట్ అయితే విజయ్ దేవరకొండ, పూరి చేతికి దొరికేవాడు కాదు.. కానీ కామ్రేడ్ దెబ్బకి విజయ్ దేవరకొండ కూడా పూరి తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడని.. ఇక పూరి కూడా విజయ్ ని ఓ యూత్ ఫుల్ మాస్ స్టోరీ తో ఇంప్రెస్ చేసాడని అంటున్నారు. దాదాపుగా పూరి – విజయ్ సినిమా ఫిక్స్ అని … అయితే ఈసినిమా ని ప్రొడ్యూస్ చేసే నిర్మాత విషయంలో తర్జనభర్జలు జరుగుతున్నాయనే టాక్ వినబడుతుంది.

Tags:    

Similar News