ఇన్ స్టాగ్రామ్ లోకి తలపతి ఎంట్రీ.. రావడమే రికార్డు సృష్టించిన విజయ్

ఏప్రిల్ 2న విజయ్ ఇన్ స్టాగ్రామ్ పర్సనల్ ఖాతా తెరిచారు. actorvijay అనే పేరుతో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి, మొదటగా;

Update: 2023-04-03 06:55 GMT
actor vijay insta follwers record

actor vijay insta follwers record

  • whatsapp icon

తమిళ స్టార్ హీరో విజయ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్ తో పాటు.. తెలుగులోనూ ఆయనకు ఫ్యాన్ బేస్ ఎక్కువే. ముఖ్యంగా తమిళనాడులో విజయ్ సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. అలాంటి ఈ స్టార్ హీరో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రావడంతోనే రికార్డు సృష్టించాడు విజయ్.

ఏప్రిల్ 2న విజయ్ ఇన్ స్టాగ్రామ్ పర్సనల్ ఖాతా తెరిచారు. actorvijay అనే పేరుతో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి, మొదటగా లియో సినిమా సెట్స్ లో దిగిన ఓ ఫోటోని షేర్ చేశారు విజయ్. అలాగే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా ఓ ఫోటోని పోస్ట్ చేశాడు. లియో షూట్ సమయంలో కాశ్మీర్ మంచులో దిగిన ఫొటోని పోస్ట్ చేశాడు విజయ్. ఈ అకౌంట్ ని విజయ్ స్టాఫ్ మెయింటైన్ చేయబోతున్నారు. విజయ్ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేశాడని తెలియడంతో అభిమానులు, ప్రేక్షకులు, నెటిజన్లు, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విజయ్ ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. దీంతో విజయ్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.
ఇన్ స్టా అకౌంట్ ఓపెన్ చేసిన గంటన్నరలో 1 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించారు. మూడు గంటల్లో 2 మిలియన్లు, సగం రోజులో 3.7 మిలియన్ ఫాలోవర్స్ విజయ్ ను ఫాలో చేయడం మొదలు పెట్టారు. అతితక్కువ సమయంలో మూడున్నర మిలియన్లకు పైగా ఫాలోవర్లను చేరుకున్న స్టార్ హీరోగా విజయ్ సరికొత్త రికార్డును సృష్టించాడు. అలాగే ప్రపంచంలోనే అతితక్కువ సమయంలో 1 మిలియన్ ఫాలోవర్స్ సాధించిన అకౌంట్ గా మూడో ప్లేస్ లో, ఇండియాలో మొదటి ప్లేస్ లో నిలిచాడు విజయ్. ప్రపంచంలో తక్కువ టైంలో ఫాలోవర్స్ తెచ్చుకున్న వారిలో మొదటి ప్లేస్ లో BTS V, రెండో ప్లేస్ లో ఏంజెలినా జోలీ ఉన్నారు.




Tags:    

Similar News