విరూపాక్ష 8 రోజుల కలెక్షన్స్.. PS-2 ప్రభావం పడిందా ?

మొదటి రోజే రూ.12 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా.. నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇప్పుడు..

Update: 2023-04-29 13:30 GMT

virupaksha 8 days collections

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా, సంయుక్త మీనన్ కీలక పాత్రలో రూపొందిన సినిమా విరూపాక్ష. ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మౌత్ టాక్ తోనే ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించింది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి సుకుమార్ కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు. సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. విడుదల రోజునే ఈ సినిమా అన్ని ప్రాంతాలలోను సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది.

మొదటి రోజే రూ.12 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా.. నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇప్పుడు రూ.100 కోట్ల దిశగా పయనిస్తోంది. నిన్నటితో విరూపాక్ష విడుదలై 8 రోజులు పూర్తవగా.. 8 రోజుల్లో రూ.65 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. 28న విడుదలైన ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాల ప్రభావం విరూపాక్ష వసూళ్లపై పడుతుందన్న టాక్ వచ్చినప్పటికీ.. అలాంటిదేమీ కనిపించలేదు. ఏ జోనర్ ప్రేక్షకులు.. ఆ జోనర్ ను ఆదరిస్తుండటంతో.. విరూపాక్ష వసూళ్ల వర్షం కొనసాగుతోంది.




Tags:    

Similar News