శర్వా శ్రీకారం ఏమైంది!!

ఎప్పుడో షూటింగ్స్ పూర్తయిన సినిమాల్ని థియేటర్స్ తెరుచుకోని కారణంగా నెమ్మదిగా ఓటిటి బాట పడుతున్నాయి. హిట్స్ మీదున్న హీరోలే ఓటిటికి జై కొడుతున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన [more]

Update: 2020-09-24 05:04 GMT

ఎప్పుడో షూటింగ్స్ పూర్తయిన సినిమాల్ని థియేటర్స్ తెరుచుకోని కారణంగా నెమ్మదిగా ఓటిటి బాట పడుతున్నాయి. హిట్స్ మీదున్న హీరోలే ఓటిటికి జై కొడుతున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమాలు ఇప్పుడు నెమ్మదిగా ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మార్చి లో విడుదల కావాల్సిన వి, నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా ఓటిటి బాట పట్టగా.. రామ్ రెడ్ కానీ, వైష్ణవ తేజ్ ఉప్పెన కానీ థియేటర్స్ కోసం వేచి చూస్తున్నాయి. ఇక కొద్దిమేర షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని ఓటీటీకి జై కొట్టేలా కనబడుతుంది వ్యవహారం. ఇంత జరుగుతూన్న శర్వానంద్ మాత్రం గమ్మునుంటున్నాడు.

జానూ సినిమాతో హిట్ కొట్టిన కలెక్షన్స్ రాక డీలా పడిన శర్వానంద్ శ్రీకారం గత ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా సేంద్రియ వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన శ్రీకారం సినిమాతో శర్వానంద్ మళ్ళీ హిట్ కొడతాడనుకుంటే కరోనా మొత్తం రివర్స్ చేసింది. అయితే కరోనా ఉన్నా హీరోలంతా షూటింగ్స్ అంటూ సెట్స్ మీదకెళుతున్నారు. ఇక శర్వానంద్ కూడా అజయ్ భూపతి తో మహాసముద్రం సినిమా మొదలెట్టబోతున్నాడు. కానీ శ్రీకారం ముచ్చట్లే ఇంకా బయటికి రావడం లేదు. కిశోర్ రెడ్డి దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన శ్రీకారం మూవీ ఓటిటి కి వదులుతారా? లేదంటే థియేటర్స్ ఓపెన్ అయ్యాకే అంటారా? అనేది మూవీ టీం క్లారిటీ ఇవ్వడం లేదు. 

Tags:    

Similar News