కోవిడ్ ఎఫెక్ట్ : జనవరి 8 నుంచి స్కూల్స్ బంద్ !
తాజాగా అస్సాం రాష్ట్రం కూడా ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయింది. అక్కడి ప్రభుత్వం కోవిడ్ కట్టడి చర్యలు చేపట్టింది. ఇప్పటివరకూ
దేశవ్యాప్తంగా కోవిడ్, ఒమిక్రాన్ లు తీవ్ర రూపం దాల్చాయి. రెండు రకాల వైరస్ లతో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కోవిడ్ వ్యాప్తి, థర్డ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయాయి. కొన్ని రాష్ట్రాలు స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు, థియేటర్లను మూసివేయగా.. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు మాత్రం 50 శాతం ఉద్యోగులతో నడిపేందుకు షరతులతో కూడా అనుమతులు ఇచ్చాయి.
Also Read : మే 2 నుంచి ఇంటర్ పరీక్షలు ?
తాజాగా అస్సాం రాష్ట్రం కూడా ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయింది. అక్కడి ప్రభుత్వం కోవిడ్ కట్టడి చర్యలు చేపట్టింది. ఇప్పటివరకూ ఉన్న కోవిడ్ మార్గదర్శకాలను మరింత కఠినతరం చేసింది. ఈ క్రమంలో 5వ తరగతి వరకూ విద్యార్థులకు జనవరి 30వరకూ సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కామరూప్-మెట్రోపాలిటన్ జిల్లాలో 8వ తరగతి వరకు, ఇతర అన్ని జిల్లాల్లో 5వ తరగతి వరకు అన్ని పాఠశాలలు జనవరి 8 నుండి మూసివేయబడతాయి. అలాగే పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులు మాత్రమే హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ ల్లోకి ప్రవేశించడానికి అనుమతించబడతారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ ఉంటుందని సీఎం డాక్టర్ హిమంత బిస్వా శర్మ తెలిపారు.