13 మంది మృతి.. 40 మంది గల్లంతు
అమర్‌నాథ్ క్షేత్రంలో అకస్మాత్తుగా సంభవించిన వరద బీభత్సంతో 13 మంది ప్రాణలు కోల్పోయారు
అమర్‌నాథ్ క్షేత్రంలో అకస్మాత్తుగా సంభవించిన వరద బీభత్సంతో 13 మంది ప్రాణలు కోల్పోయారు. నలభై మంది వరకూ గల్లంతయినట్లు తెలిసింది. వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక్కసారిగా వర్షం కురవడంతో వరదపోటెత్తింది. గుడారాలలో ఉన్న భక్తులు గల్లంతయ్యారు. కొండలపై నుంచి ఒక్కసారి గా వర్షపు నీరు ముంచెత్తింది. వరదతో పాటు రాళ్లు, బురద కొట్టుకు రావడంతో అక్కడ గుడారాల్లో ఉన్న 13 మంది మరణించారు.
గల్లంతయిన వారి...
40 మంది వరకూ వరద నీటిలో కొట్టుకుపోయారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల కోసం ఏర్పాటు చేసిన మూడు వంటశాలలు, 25 గుడారాలు ధ్వంసమయ్యాయని ప్రతక్షసాక్షులు చెబుతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. చిక్కుకుపోయిన ఐదుగురు యాత్రికులను రక్షించారు. ప్రస్తుతం అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.