నేడు రైతుల ఖాతాల్లో నగదు
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద నేడు రైతులకు నగదును అందచేయనున్నారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద నేడు రైతులకు నగదును అందచేయనున్నారు. రైతులను ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయననున్నారు. విడతల వారీగా జమ చేస్తారు. విడకు రెండు వేల రూపాయలు చెల్లిస్తారు. ఇప్పటి వరకూ తొమ్మిది సార్లు మోదీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నగదును జమ చేసింది.
పదో విడతగా....
ఈసారి పదవ విడత మొత్తాన్ని ఈరోజు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. దీని ద్వారా పది కోట్ల మంది రైతులు లబ్ది పొందనున్నారు. ఇరవై వేల కోట్ల రూపాయలను నేరుగా నేడు రైతుల ఖాతాల్లోకి వెళ్లనున్నేాయి. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.