లాలూను విచారించనున్న సీబీఐ

మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను నేడు సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఈ మేరకు సీబీఐ సమన్లను జారీ చేసింది

Update: 2023-03-07 03:27 GMT

మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను నేడు సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఈ మేరకు సీబీఐ ఇప్పటికే సమన్లను జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో నేడు లాలూ ప్రసాద్ యాదవ్ విచారణను ఎదుర్కొననున్నారు. రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలను ఇప్పించేందుకు కొందరు అభ్యర్థుల నుంచి లాలూ ప్రసాద్ భూములను తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపై ఇప్పటికే కేసు నమోదయింది.

రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు...
ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవిని ఇప్పటికే సీబీఐ అధికారులు విచారించారు. ఈరోజు లాలూను ప్రశ్నించనున్నారు. 2004 నుంచి 2009 వరకూ యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగిందని అధికారులు గుర్తించారు. భూములను లంచంగా తీసుకున్నట్లు ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపారు. లాలూ, రబ్రీదేవితో పాటు ఈ కేసులో మరో 14 మంది నిందితులుగా ఉన్నారు.


Tags:    

Similar News