Priyanka Gandhi : నేడు వాయనాడ్‌లో ప్రియాంక నామినేషన్
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నేడు వాయనాడ్ లో నామినేషన్ దాఖలు చేయనున్నారు
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కేరళలోని వాయనాడ్ స్థానానికి తన నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ప్రియాంక గాంధీ ఇన్నాళ్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. తొలిసారి కేరళలోని వాయనాడ్ ను ఎంచుకున్నారు. రాహుల్ గాంధీ రాజీనామాతో ఉప ఎన్నిక ఏర్పడింది.
రాహుల్ రాజీనామాతో...
రాహుల్ గాంధీ మొన్నటి ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలవడంతో వాయనాడ్ ను వదులుకున్నారు. ఆ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆమె నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాహుల్, సోనియా గాంధీలతో పాటు కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు.