Garlic : వెల్లుల్లిని కాపాడుకోవడం కోసం సీసీ కెమెరాలు

వెల్లుల్లిని కాపాడుకోవడం కోసం రైతులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు

Update: 2024-02-17 02:58 GMT

వెల్లుల్లిని కాపాడుకోవడం కోసం రైతులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ధరలు విపరీతంగా పెరగడంతో దొంగలు పొలాల్లో పడి వెల్లుల్లిని ఎత్తుకెళ్లిపోతున్నారు. నాడు టమాటా తరహాలోనే నేడు వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. కిలో వెల్లుల్లి ధర ఐదు వందల రూపాయలు పలుకుతుండటంతో దొంగలు కూడా వెల్లుల్లి కోసం పొలాల్లోకి వచ్చి దోచుకు వెళుతున్నారు. దీంతో రైతులు తమ పంటను కాపాడుకోవడం కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

నాడు టమాటా.. నేడు...
టమాటాల కోసం కొంతకాలం క్రితం బౌన్సర్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లే ఇప్పుడు వెల్లుల్లి కోసం కూడా అదే తరహాలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటుండటం విశేషం. ధరలు విపరీతంగా పెరగడంతో రైతులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లోని ఛింధ్వాడా జిల్లా మోహ్‌ఖేడ్ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో వెల్లుల్లిని చోరీ చేసిన ఘటనలు వెలుగు చూడటంతో రైతులు వాటిని కాపాడుకోవడం కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు.


Tags:    

Similar News