నాలుగు సూత్రాలతోనే ఈ బడ్జెట్
నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు
నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ ను రూపొందించామని చెప్పారు. మహిళ శిశు సంక్షేమ శాఖను పూర్తిగా వ్యవస్థీకరించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం రెండు లక్షల కోట్ల ఆర్థిక నిధులను వెచ్చించనున్నామని చెప్పారు.
ఏడు రంగాలపై.....
ఏడు రంగాలపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. పీఎం గతి శక్తి, అభివృద్ధి, ఉత్పాదకత, అవకాశాలు, శక్తివనరులు, వాతావరణ మార్పులపై అధ్యయనం, పెట్టుబడులకు చేయూత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. వచ్చే ఏడాదిని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించినట్లు తెలిపారు. కృష్ణా - గోదావరి, కృష్ణా - పెన్నా పెన్నా - కావేరీనదుల అనుసంధానికి ప్రణాళికలను రూపొందించామని, తాము అందుకు సహకరిస్తామని ఆమె తెలిపారు.