India Vs South Africa First Test : నేడు తొలి టెస్ట్.. మ్యాచ్ జరిగేనా? అనుమానమే?
నేడు భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. సెంచూరియన్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
నేడు భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. సెంచూరియన్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టీ 20 సిరీస్ ను సమం చేసిన భారత్, వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. టెస్ట్ సిరీస్ ను కూడా సొంతం చేసుకోవాలని భారత్ పరితపిస్తుంది. అయితే సౌతాఫ్రికాపై ఇప్పటి వరకూ టెస్ట్ సిరీస్ లో విజయం సాధించింది లేకపోవడంతో సరికొత్త రికార్డు దిశగా భారత్ ప్రయత్నిస్తుందన్న నమ్మకంతో అభిమానులున్నారు. 1992 నుంచి సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్‌ను గెలవలేకపోవడంతో ఈసారైనా విజయం దక్కుతుందేమోనన్న ఆశలు ఉన్నాయి.
సఫారీలు సయితం...
సఫారీలు కూడా వన్డే సిరీస్ ను కోల్పోవడంతో టెస్ట్ సిరీస్ లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ జరిగేది అనుమానం తక్కువే. ఎందుకంటే సెంచూరియన్ లో వాతావరణ శాఖ నివేదిక ప్రకారం వర్షం కురుస్తుందని చెప్పడంతో మ్యాచ్ జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు దశాబ్దాల కలను నెరవేర్చుకునేందుకు భారత్, టెస్ట్ సిరీస్ లో గెలిచి తమ దేశ ప్రతిష్టను నిలబెట్టుకునేందుకు దక్షిణాఫ్రికా తీవ్రంగా శ్రమించనున్నాయి.
సీనియర్ ఆటగాళ్లు...
అయితే ఈ జట్టులో ఇప్పటికే సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి వచ్చి చేరారు. వీరితో పాటు యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జడేజా, శార్దూల్, బూమ్రా, ప్రసిద్ధ్, సిరాజ్ లు ఉన్నారు. దక్షిణాఫ్రికాపై టెస్ట్ లలో పై చేయి సాధించడమే లక్ష్యంగా ఈ జట్టు కూర్పు ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా భారత్ పటిష్టంగా ఉండటంతో కొంత ఆశలు ఉన్నాయనే చెప్పాలి. ఆల్ ది బెస్ట్ టీం ఇండియా.