బర్త్‌డే గిఫ్ట్ ఇస్తారో లేదో తెలియదు

తనకు సోనియా గాంధీ బర్త్ డే గిఫ్ట్ ఇస్తోందో లేదో ‌తనకు తెలియదని కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తెలిపారు;

Update: 2023-05-15 07:16 GMT
బర్త్‌డే గిఫ్ట్ ఇస్తారో లేదో తెలియదు
  • whatsapp icon

తనకు సోనియా గాంధీ బర్త్ డే గిఫ్ట్ ఇస్తోందో లేదో ‌తనకు తెలియదని కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తెలిపారు. ఆయన ఢిల్లీకి బయలుదేరే వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎంపిక నిర్ణయాన్ని కాంగ్రెస్ హై కమాండ్‌కి వదిలేశామని తెలిపారు.

వీర విధేయుడిని...
తాను కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి విధేయుడిని అని డీకే శివకుమార్‌ తెలిపారు. ఈరోజు తన పుట్టిన రోజు అని, తాను కొన్ని పూజలు చేయాలని, నా విశ్వాసం ప్రకారం ఆ పూజలే తనను కాపాడతాయని డీకే శివకుమార్ తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ కోసం ఏమేమి చేయాలో అవన్నీ చేశానని, ప్రజలు తనను 130 సీట్లు ఇచ్చారని డీకే శివకుమార్‌ అన్నారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆయన ఢిల్లీకి బయలుదేరే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News