రాష్ట్రపతి ప్రసంగం సమయంలో స్టాలిన్ బ్యాచ్ హడావిడి

రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో విపక్షాలు నినాదాలు చేశాయి. ప్రధానంగా కాంగ్రెస్, డీఎంకే సభ్యులు నినాదాలు చేశారు.;

Update: 2022-01-31 06:33 GMT
president speech, dmk, congress, slogans
  • whatsapp icon

రాష్ట్రపతి ఉభయ సభలను ప్రసంగిస్తున్న సమయంలో విపక్షాలు నినాదాలు చేశాయి. ప్రధానంగా కాంగ్రెస్, డీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యంగా డీఎంకే సభ్యులు తమ రాష్ట్రంలో గవర్నర్ అనుసరిస్తున్న వైఖరిని తప్పుపడుతూ పెద్దయెత్తున ఆందోళన చేశారు.

గవర్నర్ తీసుకున్న.....
తమిళనాడులో గవర్నర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపడంలో జాప్యం చేస్తున్నారని డీఎంకే నేతలు నినాదాలు చేశారు. నీట్ బిల్లులపై ఆమోదముద్ర వేయకుండా గవర్నర్ జాప్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. పార్లమెంటు సమావేశాల్లో చైనా ఆక్రమణలు, పెగాసస్ పై న్యూయార్క్ టైమ్స్ కథనం, కోవిడ్ పరిస్థిితి వంటి అంశాలపై పార్లమెంటులో రగడ చేయాలని విపక్షాలు సిద్ధమయ్యాయి.


Tags:    

Similar News