Parliament : నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు ముందు బడ్జెట్ సమావేశాలు కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం పదకొండు గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్పతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టానున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఈ సమావేశాలను నిర్వహించనున్నారు.
రాష్ట్రపతి పాలనతో ఉన్న...
మొదటి రెండు రోజుల పాటు జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశఆరు. ఫిబ్రవరి రెండో తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ జరగనుంది. కేంద్ర బడ్జెట్ తో పాటు రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ము, కాశ్మీర్ లకు వేర్వేరుగా బడ్జెట్ లను కూడా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. కాగా లోక్‌సభలో 146 మంది సస్పన్షన్‌లను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు జరిగే చివరి సమావేశం కావడంతో వాడి వేడి చర్చలు జరిగే అవకాశముంది.