సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ గుడ్ న్యూస్
సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. లోయర్ బెర్త్ కేటాయింపు పై క్లారిటీ ఇచ్చింది
రైలు అనేది సుఖ వంతమైన ప్రయాణం. రైలులో ప్రయాణం చేయడం అనేది ఒక అనుభూతి. అందులో సీనియర్ సిటిజన్లు రైళ్లలో ప్రయాణించేటప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే అలాంటి వారి కోసం రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అరవై ఏళ్లు ఆ పైబడిన వారికి లోయర్ బెర్తను కేటాయించనుంది. అయితే ఇందుకు కొన్ని షరతులు కూడా ఉన్నాయి. సీనియర్ సిటిజన్లు ఒంటరిగానో, లేక ఇద్దరు వ్యక్తులతో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది.
షరతులివే...
అంతకంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్ వెంట ఉంటే లోయర్ బెర్త్ సౌకర్యం వర్తించదు. లోయర్ బెర్త్ లో పడుకుని సులవుగా, విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణం చేయవచ్చన్న భావనతో సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ ఈ గుడ్ న్యూస్ చెప్పింది. టిక్కెట్ బుకింగ్ సమయంలోనే వయసును బట్టి సీటు కేటాయింపు జరుగుతుందని రైల్వే శాఖ తెలిపింది. అదే సమయంలో ఒకవేళ కేటాయింపు జరగకపోతే లోయర్ బెర్త్ ను టీసీని అడిగి మరీ పొందవచ్చని కూడా తెలిపింది.