Sabarimala : నేటి నుంచి ఆలయం మూసివేత

శబరిమల ఆలయాన్ని నేటి నుంచి మూసివేయనున్నారు. ఈ ఏడాది ఆదాయం 357 కోట్లు వచ్చిందని బోర్డు తెలిపింది

Update: 2024-01-21 03:15 GMT

శబరిమల ఆలయాన్ని నేటి నుంచి మూసివేయనున్నారు. ఇప్పటికే దర్శనాలు ముగియడంతో ఈరోజు ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేయనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో భక్తులు శబరిమలకు వచ్చారు. ప్రధానంగా నవంబరు, డిసెంబరు నెలలలో శబరిమల భక్తులతో కిటికటలాడింది. దర్శనానికి 24 గంటల సమయం కూడా పట్టిన రోజులున్నాయి. రహదారులపై అనేక చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఈ ఏడాది ఆదాయం...
చివరకు కేరళ హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. శబరిమలలో అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా సరైన వసతులు సమకూర్చలేదని అనేక మంది దేవస్థానం కమిటీపై మండిపడ్డారు. దీంతో వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపడతామని ప్రకటించింది. ఈ ఏడాది శబరిమల అయ్యప్ప ఆలయానికి 357 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం ప్రకటించింది. అయ్యప్ప స్వామిని మొత్తం యాభై లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని అంచనా.


Tags:    

Similar News