Taj Hotels: సైబర్ దాడి.. 15 లక్షల మంది కస్టమర్ల డేటా లీక్!

Taj Hotels: దేశంలోని దిగ్గజ సంస్థలు సంస్థలైప సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. వెబ్‌సైట్‌లకు ఎంత సెక్యూరిటీ ఉన్నా..

Update: 2023-11-24 16:51 GMT

Taj Hotels: దేశంలోని దిగ్గజ సంస్థలు సంస్థలైప సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. వెబ్‌సైట్‌లకు ఎంత సెక్యూరిటీ ఉన్నా.. సైబర్‌ అటాక్‌లు జరుగుతూనే ఉన్నాయి. విలువైన డేటాను చోరీ చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. సాంకేతికత పెరుగుతున్న క్రమంలో సైబర్ భద్రతను కట్టుదిట్టం చేసుకుంటున్నప్పటికీ.. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రముఖ కంపెనీలే లక్ష్యంగా దాడులు చేస్తూ లక్షలాది మంది డేటాను ప్రమాదంలో పడేలా చేసేస్తున్నారు. టాటా గ్రూప్ నకు చెందిన తాజ్ హోటల్ గ్రూప్‌పై సైబర్ దాడి జరిగినట్లు నేషనల్ మీడియాల్లో కథనలు వెలువడ్డాయి. నవంబర్ 5న టాటా గ్రూప్ యాజమాన్యంలోని తాజ్ హోటల్ గ్రూప్‌పై సైబర్ దాడి జరిగింది.

15 లక్షల మంది డేటా ప్రమాదంలో..

ఈ సైబర్ దాడి వల్ల దాదాపు 15 లక్షల మంది కస్టమర్లు ప్రభావితమయ్యారని మీడియా కథనాలలో పేర్కొంది. అతని వ్యక్తిగత నంబర్, ఇంటి చిరునామా, మెంబర్‌షిప్ ఐడీ వంటి అనేక సమాచారం హ్యాకర్లకు చేరింది. బెదిరింపులకు పాల్పడుతున్న హ్యాకర్లు తమ వద్ద 2014 నుంచి 2020 వరకు డేటా ఉందని చెప్పినట్లు తెలుస్తోంది.

లైవ్ మింట్ వార్తల ప్రకారం, సైబర్ హ్యాకర్లు కస్టమర్ డేటాకు బదులుగా తాజ్ హోటల్ గ్రూప్ నుండి రూ. 4 లక్షల (5 వేల డాలర్లు) కంటే ఎక్కువ డిమాండ్ చేశారు. హ్యాకర్లు తమ గ్రూప్‌కి DNA కుక్కీలు అని పేరు పెట్టారు. ఈ డేటా ఇంకా ఎవరికీ ఇవ్వలేదని చెప్పారు.

IHCL ఏం చెప్పింది?

ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సిఎల్) ప్రతినిధి మాట్లాడుతూ హ్యాకర్ల క్లెయిమ్ గురించి మాకు కూడా తెలిసింది. అయితే, ఈ డేటా సున్నితమైనది కాదు.. ఈ డేటాలో సున్నితమైనది ఏమీ లేదు. కంపెనీ తన కస్టమర్ల డేటా గురించి ఆందోళన చెందుతోంది. మేము డేటా గురించి పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ విషయాన్ని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In)కి కూడా తెలియజేసినట్లు చెప్పారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

Tags:    

Similar News