మయన్మార్ లో దారుణం ... 30 మంది మృతి
మయన్మార్ లో దారుణం చోటు చేసుకుంది. సైనికుల కాల్పుల్లో ముప్పయి మంది పౌరులు మృతి చెందారు.
మయన్మార్ లో దారుణం చోటు చేసుకుంది. సైనికుల కాల్పుల్లో ముప్పయి మంది పౌరులు మృతి చెందారు. ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని ఆర్మీ కూల్చి వేసిన సంగతి తెలిసిందే. సైనిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిపై ఆర్మీ ఉక్కుపాదం మోపుతుంది. సైనికులకు వ్యతిరేకంగా గొంతు విప్పుతున్న వారిని అణిచివేసే చర్యలకు దిగుతుంది. సాయుధ బలగాలకు, సైన్యానికి మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పట్టుకుని కాల్చి చంపి....
దీంతో ప్రజలు శరణార్ధి శిబిరాలకు తరలి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలోనే కహాయ్ రాష్ట్రంలోని మోసో గ్రామంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముఫ్ఫయి మంది మరణించారు. మృతి చెందిన వారిలో చిన్నారులు, మహిళలు ఉండటం అంతర్జాతీయ సమాజం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. పరుగెత్తుతున్న వారిని పట్టుకుని కాల్చడం అమానవీయమన్న కామెంట్స్ వినపడుతున్నాయి.