Indian Railways: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చర్యలు అదుర్స్..
ndian Railways: ఇండియన్ రైల్వే ప్రయాణికుల మెరుగైన సదుపాయాలను అందించడమే కాకుండా భద్రత విషయంలో కూడా ఏ మాత్రం;
Indian Railways: ఇండియన్ రైల్వే ప్రయాణికుల మెరుగైన సదుపాయాలను అందించడమే కాకుండా భద్రత విషయంలో కూడా ఏ మాత్రం తగ్గలేదు అక్రమాలు, ఘర్షణలు, దొంగతనాలు, అక్రమ రవాణా, తప్పిపోయిన వారిని కుటుంబానికి దగ్గర చేయడం, నేరాలను అదుపు చేయడం ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాలుగా విజయాలు సాధించింది ఇండియన్ రైల్వే. భారత రైల్వే వ్యవస్థలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), దక్షిణ మధ్య రైల్వే 2023లో ఎన్నో విజయాలు సాధించింది. అవి వివరాలను మీడియాతో పంచుకున్నారు. మరి అవేంటో ఓ సారి తెలుసుకుందాం.
2023లో చేపట్టి చర్యలు ఇవే..
☛ 2023 సంవత్సరంలో రైల్వే రిజర్వేషన్ టిక్కెట్లను అనధికారికంగా విక్రయించినందుకు మొత్తం 261 మందిని అరెస్టు చేసి రూ. 2,30,59,680 విలువ చేసే 8770 టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
☛ రైల్వే ప్రాంగణంలో ట్రేస్ పాసింగ్(అనధికారిక కదలికలు) కారణంగా 28,778 మంది వ్యక్తులను పట్టుకుని రూ.25,77,700 జరిమానా రూపంలో వసులు చేశారు.
☛ ప్రయాణికుల భద్రతకు అపాయం కలిగించే 728 మంది అనుమానిత వ్యక్తులను అరెస్టు చేసి రూ.10,28,100 జరిమానా విధించారు
☛ అధికారిక టికెట్ లేకుండా రిజర్వ్ చేయబడిన కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించినందుకుగాను 702 మంది అనధికారిక వ్యక్తులను గుర్తించి వారి వద్దనుండి రూ.1,47,000 జరిమానా
☛ ఫుట్‌బోర్డ్‌లపై ప్రయాణించినందుకు 627 మందిని పట్టుకున్నారు.
☛ టిక్కెట్ లేకుండా ప్రయాణించినందుకు 1903 మందిని పట్టుకొని వారికి రూ .1,35,750 జరిమానా విధించారు.
☛ రైలులో మహిళా కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించినందుకు 835 మంది పురుష ప్రయాణికులను పట్టుకుని వారి నుంచి రూ.1,53,400 జరిమానా విధించారు.
☛ రైల్వే ప్రాంగణంలో ధూమపానం చేసిన 1,586 మందిని పట్టుకుని రూ.1,38,500 జరిమానా విధించారు.
☛ రైల్వే ప్రాంగణంలో చెత్తవేసే 18,002 మందిని పట్టుకుని రూ.37,23,400 జరిమానా విధించారు.
☛ సీఓటీపీఏ (సిగరెట్ అండ్ అదర్ టోబాకో ఆక్ట్ )కింద 11,437 మంది వ్యక్తుల నుంచి రూ.19,41,600 జరిమానా వసూలు
☛ రైళ్లలో ప్రమాదకరమైన/పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్న 19 మందిని అరెస్టు చేశారు.
☛ రైల్వే ఆస్తులను అక్రమంగా ఆక్రమించినందుకు గాను మొత్తం 693 మంది వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1,97,21,178 విలువైన రైల్వే ఆస్తుల స్వాధీనం
☛ నడుస్తున్న రైళ్లపై రాళ్లు రువ్వినందుకు 401 కేసులు నమోదు కాగా,327 మందిని అరెస్టు చేశారు.
☛ రైల్వే నెట్‌వర్క్ పరిధిలో రూ. 23,09,47,065 విలువైన 3293 కిలోల గంజాయిని రవాణా చేసినందుకు 161 మంది వ్యక్తులను అరెస్టు చేశారు.
☛ అక్రమంగా తరలిస్తున్న రూ.3,94,87,700 విలువ చేసే 22,905 కిలోల బెల్లం స్వాధీనం చేసుకుని 66 మందిని అరెస్టు చేశారు .
☛ అక్రమమద్యం రవాణాను ఆరికట్టేందుకు రూ. 28,65,427/- విలువ చేసే 5,429 మద్యం సీసాలను రవాణా చేసిన 88 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
☛ రైల్వే ప్రాంగణంలో ప్రయాణికుల వస్తువులను దొంగిలించిన 454 మంది నేరస్థులను పట్టుకుంది.
☛ రూ.9,35,49,925 విలువైన వస్తువులు రైళ్లలో లేదా రైల్వే ప్రాంగణంలో అనుకోకుండా వదిలి వెళ్లిన ప్రయాణిలకు తిరిగి వారికి అందించారు.
☛ రైళ్లు, రైల్వే ప్రాంగణాలలో వదిలి వెళ్లిన 1,115 మంది బాలురు, 228 మంది బాలికలను రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
☛ రైల్వే ట్రాక్‌లపై ప్రాణాంతక ప్రమాదాల నుంచి 22 మంది వ్యక్తులను ప్రాణాపాయ స్థితి నుండి రక్షించ గలిగారు.