India Vs Bangladesh First Test : తొలి టెస్ట్‌లో బంగ్లాపై పట్టు సాధిస్తున్న టీం ఇండియా
ఇండియా - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీం ఇండియా పై చేయి సాధించేలా కనపడుతుంది
ఇండియా - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీం ఇండియా పై చేయి సాధించేలా కనపడుతుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ ఐదు వికెట్లు కోల్పోయింది. కేవలం 44 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో శాద్‌మాన్ ఇస్లామ్ రెండు, జకీర్ హసన్, మూడు పరుగులు చేయగా, మొమినల్ హక్ డకైట్ అయ్యారు. ముఫ్ఫీకర్ రహీమ్ ఎనిమిది, నజ్ముల్ హుస్సేన్ ఇరవై పరుగులు మాత్రమే చేయగలిగారు. భారత్ బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు, జస్ప్రిత్ బుమ్రా రెండు, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశారు.
332 పరుగులు వెనకబడి...
టీం ఇండియా తొలుత బ్యాటింగ్ చేసి 376 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో బంగ్లాదేశ్ ంకా 332 పరుగులు వెనకబడి ఉంది. పాకిస్థాన్ ను ఓడించి బంగ్లాదేశ్ ఊపు మీదుంది. ఇండియా మీద కూడా గెలిచి సత్తా చాటాలనుకుంటుంది. అయితే భారత్ బ్యాటింగ్ లో తొలుత తడబడినా రవిచంద్రన్ అశ్విన్, జడేజాలు భారత్ కు అత్యధిక స్కోరు అందించారు. మరో మూడు వికెట్లను త్వరగా టీం ఇండియా తీయగలిగితే తొలి టెస్ట్ ను బంగ్లాదేశ్ పై గెలిచే అవకాశాలుంటాయన్నది క్రికెట్ విశ్లేషకుల అంచనాగా వినిపిస్తుంది.