India Vs Newzealand Champions Trophy : నేడు ఇండియా - న్యూజిలాండ్ సూపర్ మ్యాచ్
ఛాంపియన్స్ ట్రోఫీలో వరస విజయాలతో దూసుకెళుతున్న ఇండియా, న్యూజిలాండ్ జట్లు నేడు తలపడనున్నాయి;

ఛాంపియన్స్ ట్రోఫీలో వరస విజయాలతో దూసుకెళుతున్న ఇండియా, న్యూజిలాండ్ జట్లు నేడు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్లు బలంగా ఉన్నాయి. చెరి రెండు పాయింట్లతో సరిసామానంగా ఉన్న ఈ జట్లు తలపడుతుండటంతో ఫ్యాన్స్ కు మాత్రం పండగేనని చెప్పాలి. రెండు మంచి జట్ల మధ్య పోరు ఎలా ఉంటుందన్నది ఈ రోజు క్రికెట్ అభిమానులు చూడగలుగుతారు. పాక్, బంగ్లాదేశ్ పై విజయాలు సాధించిన ఊపు మీదున్న రెండు జట్లు సెమీ ఫైనల్స్ కు చేరాయి.
గెలుపోటములతో...
అయితే ఈ మ్యాచ్ లో గెలపోటములతో సంబంధం లేకున్నా సెమీస్ కు చేరే అవకాశమున్నప్పటికీ దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రెండు జట్లు ఫుల్ ఫామ్ లో ఉండటంతో భారీ స్కోరు సాధించే దిశగా దుబాయ్ స్టేడియం దద్దరిల్లిపోయే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దుబాయ్ పిచ్ లు స్పిన్ కు అనుకూలం కావడంతో ఎవరిది పై చేయి అన్నది తేలడానికి సమయం చాలా సేపు పట్టే అవకాశముంది. విరాట్ కోహ్లి తన కెరీర్ లో 300 వ మ్యాచ్ ఆడబోతుండటం విశేషం.