హైదరాబాద్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. టికెట్లు ఎప్పటి నుండి దొరుకుతాయంటే..!

హైదరాబాద్ లో క్రికెట్ సందడి మొదలైంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ20 సిరీస్ లో భాగంగా

Update: 2022-09-14 14:28 GMT

హైదరాబాద్ లో క్రికెట్ సందడి మొదలైంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ20 సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లో కూడా ఓ మ్యాచ్ ను నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన టికెట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 25న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్ కోసం ఆన్‌లైన్ లో టిక్కెట్ల విక్రయం గురువారం(సెప్టెంబర్ 15) నుంచి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ ప్రకారం, టిక్కెట్లు Paytm యాప్, Paytm ఇన్సైడర్ యాప్‌లో విక్రయించనున్నారు. టికెట్ ధర రూ.300 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది.

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాదాపు 55,000 మంది సామర్థ్యం కలదు. అత్యాధునిక సదుపాయాలు ఉన్న ఈ స్టేడియంలో.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో మ్యాచ్‌లతో పాటు అనేక అంతర్జాతీయ మ్యాచ్ లను నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్నో అద్భుతమైన మ్యాచ్ లు ఈ స్టేడియంలో జరిగాయి. ఇప్పుడు మరో ఆసక్తికరమైన సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది.
టీమ్ ఇండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ , జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్
ఈ సిరీస్ లో భారత్ మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. మొదటి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 20న మొహాలీ వేదికగా సాగనుండగా.. రెండవ టీ20 మ్యాచ్ నాగ్ పూర్ వేదికగా సాగనుంది. మూడో టీ20 మ్యాచ్ హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.


Tags:    

Similar News