India Vs Srilanka : నేడు చివరి టీ 20.. క్లీన్ స్వీప్ దిశగా టీం ఇండియా

నేడు భారత్-శ్రీలంక మూడో టి20 మ్యాచ్ జరగనుంది. పల్లకలే వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.;

Update: 2024-07-30 03:20 GMT
India Vs Srilanka : నేడు చివరి టీ 20.. క్లీన్ స్వీప్ దిశగా టీం ఇండియా
  • whatsapp icon

నేడు భారత్-శ్రీలంక మూడో టి20 మ్యాచ్ జరగనుంది. పల్లకలే వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్ రెండు టీ 20లను గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. శ్రీలంక తన సొంత గడ్డపై సిరీస్ ను కోల్పోయినట్లయింది. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక భావిస్తుంది.

చివరి మ్యాచ్ లోనైనా గెలిచి...
అయితే భారత్ మాత్రం సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. రెండు జట్లు పైకి సమఉజ్జీలుగా కనిపిస్తున్నా భారత్ దే పై చేయి అయింది. భారత్ బౌలింగ్, బ్యాటింగ్ పరంగా తన సత్తా చాటడంతో రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించింది. శ్రీలంక పోరాడినా ఫలితం లేకుండా పోయింది. చివరి మ్యాచ్ లోనైనా తమ సత్తా చాటాలన్న లక్ష్యంతో లంకేయులు ఉన్నారు. ఈ జట్టులో మార్పులు చేర్పులు చేసుకుని బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News