ICC WC 2023: 6.4 ఓవ‌ర్ల‌లో 338 ప‌రుగులు చేయలేకపోయిన పాక్

ఐసీసీ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో నిలవాలంటే ఇంగ్లండ్‌తో భారీ తేడాతో గెలవాలని పాకిస్థాన్ ఆశించింది.

Update: 2023-11-11 14:27 GMT

ఐసీసీ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో నిలవాలంటే ఇంగ్లండ్‌తో భారీ తేడాతో గెలవాలని పాకిస్థాన్ ఆశించింది. అయితే ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ టాస్‌ గెలిచిన తర్వాత తొలుత బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో భారత్‌తో జరిగే తొలి సెమీ-ఫైనల్‌కు చేరే అవకాశాన్ని పాకిస్థాన్ వదులుకుంది. ఇక పాకిస్థాన్ కు కేవలం 6.4 ఓవర్లలో 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. పాక్ ఇన్నింగ్స్ ప్రారంభమైన 3 ఓవర్లలోనే ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్ అవుట్ అవ్వడంతో పాక్ టెక్నీకల్ గా కూడా టోర్నమెంట్ నుండి అవుట్ అయింది.

ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ లో బెన్ స్టోక్స్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టోక్స్ 76 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 84 పరుగులు చేశాడు. రూట్ 60 పరుగులతో రాణించాడు. కెప్టెన్ జోస్ బట్లర్ 27 పరుగులు చేయగా యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 30 పరుగులు చేశాడు. చివర్లో విల్లీ 5 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 15 పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3, షహీన్ అఫ్రిది 2, మహ్మద్ వసీం జూనియర్ 2, ఇఫ్తికార్ అహ్మద్ 1 వికెట్ తీశారు.


Tags:    

Similar News