కెప్టెన్సీని నిలబెట్టుకున్న రోహిత్ శర్మ

టెస్టు వికెట్ కీపర్ గా కేఎస్ భరత్ తన స్థానం నిలుపుకున్నాడు. పరిమిత ఓవర్ల మ్యాచ్ లకు హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా పదోన్నతి పొందగా,

Update: 2023-06-23 11:39 GMT

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మను కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఈవెంట్లలో భారత్ ఆశించినంతగా రాణించకపోవడంతో రోహిత్ శర్మను కెప్టెన్ గా తొలగిస్తారనే ప్రచారం సాగింది. కానీ వాటిని బీసీసీఐ పట్టించుకోలేదు. త్వరలోనే ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్ కు టీమిండియా టెస్టు, వన్డే జట్లను ప్రకటించారు. టీమిండియా టెస్టు, వన్డే జట్లకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఐపీఎల్ లో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ టీమిండియా టెస్టు జట్టుకు ఎంపిక చేశారు. అయితే జైస్వాల్ కు వన్డే జట్టులో స్థానం లభించలేదు. ఐపీఎల్ లో సత్తా చాటిన రుతురాజ్ గైక్వాడ్, మీడియం పేసర్ ముఖేశ్ కుమార్ లను కూడా సెలెక్టర్లు టీమిండియా టెస్టు, వన్డే జట్లకు ఎంపిక చేశారు. టెస్టు వికెట్ కీపర్ గా కేఎస్ భరత్ తన స్థానం నిలుపుకున్నాడు. పరిమిత ఓవర్ల మ్యాచ్ లకు హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా పదోన్నతి పొందగా, వెటరన్ బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానే తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు.

నెల రోజుల పాటు సాగే సిరీస్‌లో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో సిరీస్‌ను ప్రారంభించనుంది, ఇందులో మొదటిది డొమినికాలోని విండ్సర్ పార్క్ స్పోర్ట్స్ స్టేడియంలో జూలై 12 నుండి 16 వరకు జరుగుతుంది. రెండో టెస్టు మ్యాచ్ జూన్ 20 నుంచి జూన్ 24 వరకు ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరగనుంది. టెస్ట్ సిరీస్ తర్వాత, రెండు రోజుల గ్యాప్ ఉంటుంది. ఆ తర్వాత వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ తలపడనుంది. మొదటి వన్డే జులై 27న బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరగనుండగా, రెండో వన్డే జూలై 29న అదే వేదికగా జరగనుంది. సిరీస్‌లోని మూడోది, చివరి మ్యాచ్ ట్రినిడాడ్ లో ఆగస్టు 1న బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ స్టేడియంలో జరగనుంది.
వన్డే సిరీస్ తర్వాత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఇరు జట్లు తలపడనున్నాయి. ఆగస్టు 3 నుంచి టీ20 సిరీస్ జరగనుంది. టీ20 సిరీస్ కు సమయం ఉన్నందున జట్టును తర్వాత ప్రకటించనున్నారు.
టీమిండియా టెస్టు జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్, జయదేవ్ ఉనద్కట్, నవదీప్ సైనీ.
టీమిండియా వన్డే జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కట్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేశ్ కుమార్.


Tags:    

Similar News