India Vs Srilanka 2nd One Day : ఈ మ్యాచ్ లోనైనా ఆడండ్రా సామీ... గెలిచి నిలవండి బ్రో

భారత్ - శ్రీలంక రెండో వన్డే మ్యాచ్ నేడు జరగనుంది. కొలొంబో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

Update: 2024-08-04 03:31 GMT

భారత్ - శ్రీలంక రెండో వన్డే మ్యాచ్ నేడు జరగనుంది. కొలొంబో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ 20 లలో క్లీన్ స్వీప్ చేసిన టీం ఇండియా వన్డే మ్యాచ్ లలో మాత్రం తడబడిందనే చెప్పాలి. ముఖ్యంగా బ్యాటర్లు రాణించలేకపోవడంతోనే తొలి వన్డే మ్యాచ్ టై గా ముగిసింది. చేజేతులా మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది. బంతులు అనేకం ఉన్నప్పటికీ ఒక్క పరుగు చేయలేక టైగా ముగియడం బ్యాటర్ల వైఫల్యమేనని చెప్పకతప్పదు. ఒక్క రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ మినహా మొదటి వన్డే మ్యాచ్ లో ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు.

బ్యాటింగ్ పరంగా...
ఇప్పుడు రెండో మ్యాచ్ లోనైనా విజయం సాధించి సిరీస్ లో ఆధిపత్యాన్ని సాధించాలని భారత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భారత్ బ్యాటింగ్ పరంగా చూస్తే చాలా బలంగా కనిపిస్తుంది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కొహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, శివమ్ దూబే, అక్షర్ పటేల్ ఇలా అందరూ ఉద్దండులే. ఒకరు కాకపోతే మరొకరు బాగా రాణించగలిగితే స్కోరును ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదు. అలాగే మొదట బ్యాటింగ్ చేసినా అత్యధిక స్కోరును చేసేందుకు అవకాశముంది. అలాంటిది మొదటి మ్యాచ్ లో 231 పరుగులు చేయలేక చేతులెత్తేశారంటే ఖచ్చితంగా మన బ్యాటర్ల వైఫల్యమేనని అందరూ ఒప్పుకుని తీరాల్సిందే.
స్పిన్నర్లను తట్టుకోవడం...
అందుకోసమే ఈ మ్యాచ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదే మైదానంలో మ్యాచ్ జరుగుతుండటంతో స్పిన్నర్లతో కొంత ఇబ్బంది పడుతున్నారు మనోళ్లు. లంక స్పిన్నర్లను తట్టుకోవడం కష్టమయింది. తొలి మ్యాచ్ కావడంతో కొంత అలవాటు పడాలని, రెండో మ్యాచ్ లో మనోళ్లు స్పిన్నర్లను కూడా ఉతికిపారేస్తారంటున్నారు క్రీడానిపుణులు. శ్రీలంక స్పిన్నర్ హసరంగ గాయం నుంచి ఈ సిరీస్ నుంచి తప్పుకోవడం భారత్ కు కొంత ఊరట కల్గించే అంశంగా చెప్పుకోవాలి. భారత్ జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయంటున్నారు. మొత్తం మీద ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ లో పై చేయి సాధించాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు.


Tags:    

Similar News