India vs Srilanka T20 : భారత్ - శ్రీలంక మ్యాచ్ కు వరుణగండం

భారత్ - శ్రీలంక మూడో టీ20 మ్యాచ్ కు వానగండం పొంచి ఉంది.

Update: 2024-07-30 12:33 GMT

భారత్ - శ్రీలంక మూడో టీ20 మ్యాచ్ కు వానగండం పొంచి ఉంది. వాతావరణ శాఖ చెప్పిన నివేదిక ప్రకారం పల్లెకెలె స్టేడియం ప్రాంతంలో వర్షం కురిసే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ జరిగిన రెండు మ్యాచ్ లలో భారత్ రెండింటిలో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈరోజు జరిగే మ్యాచ్ కు రెండో మ్యాచ్ తరహాలోనే వర్షం ముప్పు పొంచి ఉంని తెలిపారు. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ తహతహలాడుతుండగా, ఒక్క మ్యాచ్ లోనైనా గెలిచి తమ దేశ ప్రతిష్టను కాపాడుకోవాలని శ్రీలంక భావిస్తుంది.

టాస్ గెలిచిన జట్టు...
మ్యాచ్ భారత్ కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. పల్లెకెలె స్టేడియంలో చిరుజల్లులతో పాటు బలమైన గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలున్నాయి. మొదట్లో పల్లెకెలె పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని తెలిపింది. ఇక్కడ టార్గెట్ ను ఛేజ్ చేయడం సులువని గతంలో ఈ పిచ్ పై జరిగిన మ్యాచ్ గణాంకాలు తెలుపుతున్నాయి. మ్యాచ్ పూర్తిగా జరుగుతుందా? లేక వర్షం కారణంగా ఇబ్బందులు తప్పవా? అన్నది తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News