విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీలో ఆడాడని అంటున్న పొలిటీషియన్

రాజకీయ నాయకుడు తేజస్వీ యాదవ్ తన క్రికెట్ ప్రయాణం గురించి చేసిన

Update: 2024-09-15 05:08 GMT

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, రాజకీయ నాయకుడు తేజస్వీ యాదవ్ తన క్రికెట్ ప్రయాణం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. RJD నాయకుడు తేజస్వి యాదవ్ భారత క్రికెట్ గ్రేట్ విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీలో ఆడాడని చెప్పుకొచ్చాడు. తేజస్వి యాదవ్ ఒకప్పుడు మంచి క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ లో కూడా ఆడాడు.

నేను క్రికెటర్‌ని, దాని గురించి ఎవరూ మాట్లాడరు. నా కెప్టెన్సీలో విరాట్ కోహ్లి ఆడాడని తేజస్వీ చెప్పుకొచ్చాడు. ఆ విషయం గురించి ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడారా? వారు మాట్లాడరు? ప్రొఫెషనల్‌గా నేను మంచి క్రికెట్ ఆడాను. చాలా మంది టీం ఇండియా ఆటగాళ్లు నా బ్యాచ్‌మేట్స్ అని తెలిపాడు తేజస్వీ యాదవ్. తన రెండు లిగమెంట్లు ఫ్రాక్చర్ కావడంతో, క్రికెట్ ను విడిచిపెట్టాల్సి వచ్చిందని జీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజస్వీ యాదవ్ చెప్పుకొచ్చాడు. తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తేజస్వి తన కెరీర్‌లో మొత్తం 1 ఫస్ట్ క్లాస్, 2 లిస్ట్ A, 4 T20 మ్యాచ్‌లు ఆడాడు. అతను జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. నవంబర్ 2009లో విదర్భపై ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అతని నాలుగు T20 మ్యాచ్‌లు ఒరిస్సా, అస్సాం, బెంగాల్, త్రిపుర లతో సాగాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2008 సీజన్‌లో తేజస్విని ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) కూడా ఒప్పందం కుదుర్చుకుంది. అతను 2008 నుండి 2012 వరకు ఫ్రాంచైజీలో ఉన్నా బెంచ్‌ కే పరిమితం అయ్యాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.


Tags:    

Similar News