Telangana : 19న తెలంగాణ బడ్జెట్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకూ నిర్వహించాలని నిర్ణయించారు.;

Update: 2025-03-12 08:22 GMT
assembly sessions,  resume, today, telangana

telangana assembly today

  • whatsapp icon

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకూ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు అన్ని పార్టీలూ అంగీకరించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

సమావేశాలు 27 వరకూ
ఈ నెల 27వ తేదీ వరకూ సమావేశాలను నిర్వహించాలని, మధ్యలో సెలవులు ఉన్నందున ఈ నెల 19న తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 19వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తర్వాత రోజు నుంచి బడ్జెట్ పై చర్చలు జరుగుతాయి. అంటే దాదాపు పన్నెండు రోజుల పాటు ఈ సమావేశాలు సెలవులు పోను జరిగే అవకాశముంది.


Tags:    

Similar News