Pawan Kalyan : కలెక్టర్ల సమావేశానికి పవన్ డుమ్మా.. రీజన్ ఇదే
చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరు కాలేదు;

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు జరుగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది.అయితే ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. ఆరోగ్య కారణాలతో ఆయన హాజరు కాలేదని తెలిసింది. చంద్రబాబు నాయుడు కూడా పవన్ కల్యాణ్ వ్యక్తిగత కారణాల వల్ల సమావేశానికి రాలేదని తెలిపారు.
మూడోసారి జరుగుతున్న...
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడో సారి జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ఆయన కలెక్టర్లకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఈసమావేశంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్,డిజిపి హరీశ్ కుమార్ గుప్తా,వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు,ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.