16 మంది పోలీసులకు కరోనా

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో 16 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 150 మందికి కరోనా సోకింది

Update: 2022-01-16 13:47 GMT

పోలీసులను కరోనా వదిలిపెట్టడం లేదు. విధుల్లో ఉండాల్సి రావడం, వీధుల్లో విధులు నిర్వహించాల్సి వస్తుండటంతో థర్డ్ వేవ్ లో ఎక్కువ మంది పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో 16 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఒకరు ఎస్ఐ, మరొకరు ఏఎస్ఐ, పథ్నాలుగు మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకూ 150 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు.

మాస్క్ లేకుంటే....
దీంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. పదహారు మంది పోలీసులకు కరోనా నిర్ధారణ కావడంతో పోలీస్ స్టేషన్ లోకి మాస్క్ లేకుండా వస్తే నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఫిర్యాదు చేయాలనుకున్న వారు ఎవరైనా పోలీస్ స్టేషన్ లోకి రావాలంటే ఒక్కరే రావాలని ఆంక్షలు విధించారు.


Tags:    

Similar News