కేసీఆర్‌కు భారీ ఊరట

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది;

Update: 2023-12-22 12:22 GMT
kcr, brs chief ,  shock, lasya nandita

 brs leader kcr

  • whatsapp icon

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించగా.. ఆ ఎన్నికల్లో గులాబీ బాస్ కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్ కొన్ని విషయాలను గోప్యంగా ఉంచారని.. 2019లో సిద్దిపేట జిల్లా మామిడ్యాలకు చెందిన టీ. శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ ఎన్నికను రద్దు చేయాలంటూ ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా కొట్టివేస్తూ తీర్పును ఇచ్చింది. గజ్వేల్ నుంచి 2018లో కేసీఆర్ ఎన్నిక కావడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. 2018 ఎన్నికల కాలపరిమితి ముగిసిందని, దీనిపై ఇప్పుడు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసినా ఫలితం ఉండదని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.


Tags:    

Similar News