BJP : బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్.. సీఎం మారుతున్నారంటూ?

బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి రావడం ఖాయమన్నారు

Update: 2024-11-01 11:53 GMT

eleti maheshwar reddy

బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ నుంచి డిసెంబరులోపు తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి రావడం ఖాయమని ఆయన జోస్యం చేప్పారు. త్వరలోనే తెలంగాణ ప్రజలు కొత్త ముఖ్యమంత్రిని చూస్తారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏడు నెలల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమానికి వాయనాడ్ వెళ్లినప్పటికీ అక్కడ ప్రియాంక గాంధీ కూడా పలకరించలేదని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

ఏకపక్ష ధోరణిని...
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వ్యయాన్ని మూడు రెట్లు పెంచిన తర్వాత అవినీతి ఉందని బయటపడటంతో ప్రక్షాళన చేపట్టారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆపార్టీ నేతలే హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తున్నారని, సీనియర్ మంత్రులు కూడా రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని తప్పు పడుతున్నారన్న మహేశ్వర్ రెడ్డి తాను అన్నీ రీసెర్చ్ చేసే మాట్లాడతానని, తెలంగాణలో త్వరలో ముఖ్యమంత్రి రాబోతున్నారని తెలిపారు.


Tags:    

Similar News