సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు.;
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైెక్టరేట్ అధికారులు మూడు రోజులు విచారించిన తీరును కవిత సీఎం కేసీఆర్ కు వివరించారు. నిన్న రాత్రి పది గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి వచ్చిన కవిత రాత్రి ఢిల్లీలోనే బస చేశారు. ఉదయం బయలుదేరి ప్రత్యేక విమానంలో బయలుదేరి వచ్చారు.
ఈడీ విచారణపై...
మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు కూడా కవిత వెంట ఉన్నారు. ముగ్గురూ ఈడీ విచారణపై చర్చించుకున్నారు. న్యాయవాదుల సూచనలు, ఈడీ కార్యాలయం అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేసిందీ కూడా కవిత వివరించారు. మరోసారి విచారణకు వెళ్లాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిపినట్లు సమాచారం. ఈ మెయిల్ ద్వారా సమాచారం అందిన వెంటనే రావాలని ఈడీ అధికారులు సూచించారని కేసీఆర్‌కు వివరించారు.