ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్
ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువును తెలంగాణ ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది.;
ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువును తెలంగాణ ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. రెండు వందల ఐదు వందల రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 16వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. నిజానికి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు డిసెంబర్ 17వ తేదీతో ముగియగా, 500 రూపాయల అపరాధ రుసుముతో డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు ఇచ్చారు.
రెండు వేల అపరాధ రుసుంతో...
ఆ తర్వాత రెండు వేల అపరాధ రుసుముతో జనవరి 2 వరకు అవకాశం కల్పించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు. తాజాగా రెండు వందల ఐదు వందల రూపాయల అపరాధ రుసుముతో జనవరి 16వతేదీ వరకు గడువు పొడిగించారు. కాగా, రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో బోర్డు అధికారులు మరోసారి గడువు పెడిగించి కొంత ఊరట కల్గించారు.