KCR : కేసీఆర్ నోట కవిత మాట ఏదీ... ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదు?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్ విషయాన్ని ప్రస్తావించడం లేదు

Update: 2024-04-05 13:45 GMT

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల వరసగా జనంలోకి వస్తున్నారు. పొలంబాట పేరుతో ఆయన పర్యటనలు చేస్తున్నారు. రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. తర్వాత గంటలకు గంటలు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపైనే ఆయన ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఆయన ఎక్కడా తన కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్ విషయాన్ని ప్రస్తావించడం లేదు. కవితను అన్యాయంగా అరెస్ట్ చేసిందని కానీ, కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంబంధం లేదని మాత్రం కానీ చెప్పే ప్రయత్నం చేయడం లేదు.

ఇరవై రోజులవుతున్నా...
కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి దాదాపు ఇరవై రోజులు కావస్తుంది. మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆమె ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. కవిత మాత్రం తన అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్యతోనే జరిగిందని పదే పదే చెబుతున్నారు. తాను ఈ కేసులో అప్రూవర్ గా మారేది లేదని కూడా చెప్పారు. కవిత అరెస్ట్ పై మాత్రం గత నెల 15వ తేదీ నుంచి ఇప్పటి వరకూ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం ఢిల్లీ వైపు కూడా వెళ్లలేదు.
గులాబీ పార్టీ నేతలే...
కేసీఆర్ కవిత విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదన్నది బీఆర్ఎస్ నేతలే చర్చించుకుంటున్నారు. బీజేపీని రాజకీయంగా విమర్శలు చేస్తున్నారే కాని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయాలను ఏ మాత్రం ప్రస్తావించడం లేదు. కవిత కేసీఆర్ కుమార్తె. తన కుమార్తెను అన్యాయంగా అరెస్ట్ చేశారని కానీ, తనను తెలంగాణలో బద్నాం చేయడానికే కవిత అరెస్ట్ అని కూడా ఆయన చెప్పకపోవడాన్ని బీఆర్ఎస్ నేతలే కొందరు తప్పుపడుతున్నారు. పార్టీ అధినేతగా ఆమె అరెస్ట్ ను ఖండించాల్సిన అవసరం ఉందని, మొన్న నల్లగొండలోనూ, నేడు సిరిసిల్లలోనూ కవిత ప్రస్తావన తేవకపోవడం గులాబీ పార్టీలో హాట్ టాపిక్ అయింది. ,ౌ


Tags:    

Similar News