BRS : గవర్నర్ ప్రసంగం అంతా అబద్ధమే
గవర్నర్ ప్రసంగం గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే చేసినట్లుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు;
గవర్నర్ ప్రసంగం గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే చేసినట్లుందని బీఆర్ఎస్ అధినేత కడియం శ్రీహరి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ గవర్నర్ నోటి వెంట ప్రభుత్వం అబద్ధాలు చెప్పించారన్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పడం పెద్ద అబద్ధమని బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి అన్నారు.
అభివృద్ధి లేదనడం...
గత ప్రభుత్వ హయాంలోనే కేంద్ర ప్రభుత్వం ఎన్ని శాఖల్లో రివార్డులు ప్రకటించిందో గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన కోరారు. అభివృద్ధి జరగలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్న కడియం శ్రీహరి కాంగ్రెస్ ప్రభుత్వం తమను పొడిగించుకోవడానికి, గత ప్రభుత్వాన్ని దూషించడానికే గవర్నర్ ప్రసంగాన్ని ఉపయోగించుకుందని ఆయన ఫైర్ అయ్యారు.