డ్యాన్స్ చేస్తూ బీఆర్ఎస్ నేత మృతి
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాలకు చేరుకున్నారు. డ్యాన్స్ చేస్తూ బీఆర్ఎస్ నేత గుండెపోటుతో మరణించారు;
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాలకు చేరుకున్నారు. ఈరోజు జగిత్యాలలో జరగాల్సిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేత బండారు మృతికి సభలో సంతాపాన్ని ప్రకటించారు. ఆత్మీయ సమ్మేళనం కోసం పార్టీ శ్రేణులు అంతా సిద్ధం చేసుకున్నారు. అక్కడ జరిగిన సంబరాల్లో నృత్యం చేస్తూ బీఆర్ఎస్ నేత బండారి నరేందర్ మరణించారు. డ్యాన్స్ చేస్తుండగా కుప్పకూలిపోవడంతో నరేందర్‌ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బండారి నరేందర్ మరణించారు.
గుండెపోటుతో...
బండారి నరేందర్ గుండెపోటుతోనే మరణించారని వైద్యులు తెలిపారు. దీంతో ఆత్మీయ సమ్మేళనం జరగాల్సిన ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో కల్వకుంట్ల కవిత కూడా జగిత్యాల చేరుకుని కుటుంబాన్ని పరామర్శించారు. బండారు నరేందర్ మృతి పట్ల ఆయన కుటుంబానికి సంతాపాన్ని ప్రకటించారు.