మూడోసారి.. హాజరు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు కూడా ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు;
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు కూడా ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. నిన్న పది గంటలకు పైగా కవితను ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి, ప్రధానంగా సౌత్ గ్రూపునకు సంబంధించిన లావాదేవీల విషయంపై ఎక్కువగా కవితను ప్రశ్నించినట్లు సమాచారం. ఈరోజు కూడా కల్వకుంట్ల కవితను విచారణకు పిలవడంతో ఏమవుతుందోనన్న టెన్షన్ బీఆర్ఎస్ నేతల్లో ఉంది.
న్యాయవాదులతో....
కవిత ఈరోజుతో మూడోసారి విచారణకు హాజరయినట్లు. అయితే కవిత ఈరోజు విచారణకు హాజరు అవుతారా? లేదా? అన్నది మరికొద్దిసేపట్లో తెలియనుంది. ఆమె తన న్యాయవాదులుతో రాత్రి ఈడీ కార్యాలయం నుంచి వచ్చిన వెంటనే సంప్రదించారు. రాత్రి 9.40 గంటల వరకూ ఈడీ కార్యాలయంలోనే ఉన్న కవితను మరోసారి రమ్మని పిలవడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. న్యాయవాదుల సూచన మేరకు కవిత నిర్ణయం తీసుకోనున్నారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు కవిత మీడియా మాట్లాడే అవకాశముందని చెబుతున్నారు.