నేడు జగిత్యాలకు కవిత
నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు;
నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్‌లోని జగిత్యాల జిల్లాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారణకు హాజరయిన తర్వాత ఇదే తొలి జిల్లా పర్యటనకు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
తొలిసారి వస్తున్న...
తొలిసారి వస్తున్న కవితకు భారీగా స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. కవిత వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అందులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఒకటి. ఆత్మీయ సమావేశంలో కవిత ప్రసంగం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.