నేడు కవిత పిటీషన్ విచారణ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటీషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటీషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్లకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మహిళను ఇంట్లో విచారించాల్సి ఉండగా ఈడీ కార్యాలయానికి పిలవడంపై కూడా ఆమె అభ్యంతరం తెలిపారు.
ఈడీ కేవియట్...
దీనిపై నేడు విచారణ జరగనుంది. తొలుత ఈ నెల 24వ తేదీన విచారిస్తామన్న సుప్రీంకోర్టు నేటికి వాయిదా వేసింది. ఈ విషయంలో ఈడీ కూడా కేవియట్ దాఖలు చేసింది. తమ వాదనలను వినిన తర్వాతనే తీర్పు ఇవ్వాలని కోరింది. ఇప్పటికే కల్వకుంట్ల కవితను మూడు సార్లు ఈడీ విచారణ జరిపింది. విచారణకు మరోసారి పిలిచే అవకాశముండటంతో కవిత కేసులో నేడు తీర్పు ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది.