BRS : బీఆర్ఎస్ కు మాజీ మంత్రి గుడ్ బై
తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు;
తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఏర్పడిన కేసీఆర్ మంత్రివర్గంలో ఇంద్రకిరణ్ రెడ్డి మంత్రిగా చేరారు.
మంత్రిగా వ్యవహరించి...
తొమ్మిదేళ్ల పాటు మంత్రిగానే వ్యవహరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నిర్మల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. పార్టీ అభ్యర్థుల విజయానికి తన వంతు సాయం అందిస్తామని తెలిపారు.