చెరువులోనే భవనం.. వీకెండ్ లో సేదతీరటానికేనట.. కూల్చేశారుగా?

కొండాపూర్ పరిధిలోని మల్కాపూర్ గ్రామ పంచాయతీలో చెరువు మధ్యలో ఉన్న భవనాన్ని నిర్మించుకున్నారు. దానినిఅధికారులు కూల్చేశారు

Update: 2024-09-26 05:49 GMT

pond in malkapur village

కొండాపూర్ పరిధిలోని మల్కాపూర్ గ్రామ పంచాయతీలో చెరువు మధ్యలో ఉన్న భవనాన్ని నిర్మించుకున్నారు. మధిర గ్రామం కుతుబ్‌శాయిపేట్ గ్రామంలోనిచెరువులో నిర్మించిన ఈ అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు కలసి ఈ నిర్మాణాన్ని కూల్చివేశారు. నాలుగు అంతస్థుల భవనాన్ని చెరువులో నిర్మించుకుని వీకెండ్ లో వచ్చి యజమాని ఇక్కడ ఉంటారని తెలిసింది. అయితే ఈ నాలుగు అంతస్థుల భవనాన్ని అధికారులు బాంబులతో కూల్చివేశారు.

2012లో ఈ భవనాన్ని..
పన్నెండేళ్ల క్రితం అంటే 2012లో ఈ భవన నిర్మాణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. సికింద్రాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి ఈ భవనాన్ని నిర్మించినట్లు అధికారులు చెప్పారు.అయితే బాంబులతో భవనాన్ని పేల్చడంతో ఈ సందర్భంగా ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మల్కాపురం పెద్దచెరువు ఎఫ్‌టీఎస్ పరిధిలో ఈ భవనాన్ని నిర్మించారు. భవనం లోపలకి వెళ్లేందుకు మెట్ల మార్గాన్ని కూడా నిర్మించుకున్నాడు ఈ ఘనుడు.


Tags:    

Similar News